బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా జోరు పెరిగింది !


ఆగష్టు 11 న మంచి అంచనాలు ఉన్న మూడు చిత్రాలు విడుదలయ్యాయి. కానీ నేనే రాజు నేనే మంత్రి, లై చిత్రాల కన్నా థియేటర్ ల విషయంలో బెల్లం కొండ శ్రీనివాస్ చిత్రం జయ జానకి నాయక వెనుక పడింది. కానీ రెండవ వారంలోకి అడుగు పెట్టాక ఈ చిత్రానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నట్లు తెలుస్తోంది. బెల్లం కొండ – బోయపాటిల మాస్ ఎంటర్టైనర్ కు 100 స్క్రీన్ లు పెరగడం విశేషం.

రిలీజ్ టైంలో నేనేరాజు నేనే మంత్రి, లై చిత్రాలు ఎక్కువగా ప్రభావం చూపాయి. కానీ ఇప్పుడు వాటిప్రభావం కొంత తగ్గుముఖం పట్టడంతో జయజనకి నాయక చిత్రానికి కల్సి వచ్చిందని అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ చిత్ర వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.