“కేజీఎఫ్2” ట్రైలర్ సెన్సేషనల్ రికార్డ్!

Published on Mar 28, 2022 7:13 pm IST

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కేజీఎఫ్2. కేజీఎఫ్ చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం కి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా చిత్ర యూనిట్ భారతీయ బాషల్లో విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కి ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం కన్నడ ట్రైలర్ కి 18 మిలియన్ వ్యూస్, తెలుగు ట్రైలర్ కి 20 మిలియన్ వ్యూస్, హిందీ ట్రైలర్ కి 51 మిలియన్ వ్యూస్, తమిళ్ ట్రైలర్ కి 12 మిలియన్ వ్యూస్ రాగా, మలయాళ ట్రైలర్ కు 8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మొత్తం 109 మిలియన్ ప్లస్ వ్యూస్ రావడం విశేషం. భారీగా వస్తున్న వ్యూస్ తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 14 న విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :