వాయిదా పడిన శ్రీరామ్ “10th క్లాస్ డైరీస్”!

Published on Jun 17, 2022 1:39 pm IST


నటుడు శ్రీరామ్ మరియు అవికా గోర్ 10th క్లాస్ డైరీస్ లో కలిసి నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అంజి దర్శకత్వం వహించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ జూన్ 24, 2022న థియేటర్‌లలో విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

జులై 1, 2022 న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు వారు ప్రకటించారు.అదే విషయాన్ని ధ్రువీకరిస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీనివాస రెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. అచ్యుత్ రామారావు పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :