ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా “10th క్లాస్ డైరీస్” టీజర్

ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా “10th క్లాస్ డైరీస్” టీజర్

Published on Jan 26, 2022 2:00 PM IST


అవికా గోర్, శ్రీరామ్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల రామారావు, శివ బాలాజీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 10th క్లాస్ డైరీస్. అజయ్ మైసూర్ సమర్పణ లో SR మూవీ మేకర్స్, aak, మరియు అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ పతాకాల పై అచుత్ రామారావు పి. మరియు రవితేజ మన్యం లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గరుడవేగ చిత్రం అంజి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మరియు దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బోబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేయడం జరిగింది.

ఈ చిత్రం టీజర్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా ఉంది. ప్రతి ఒక్కరి జీవితం కథ గా మారేది ఈ క్లాస్ రూం లోనే అంటూ టీజర్ మొదలు అవుతుంది. పదవ తరగతి లో మొదలైన ప్రేమ 1999 కాలం నాటి ప్రేమ కథ మళ్ళీ 2021 లో ఏ విధంగా మారిపోయింది. పరిస్థితులు ఎలా మారాయి, రీ యూనియన్ కాన్సెప్ట్ తో అన్ని రకాల ఎమోషన్స్ ను చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. హీరో హీరోయిన్ మధ్యన 10 వ తరగతి లో ఉన్న సన్నివేశాలు, హీరోయిన్ పాత్ర ను మిస్టీరియస్ గా చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. హీరో హీరోయిన్ కి సారీ చెప్పేందుకు బయలు దేరి, ఎలా చివరకు ముగుస్తుంది అనేది కథ గా ఉంది. ఈ చిత్రం టీజర్ ఆద్యంతం ఆసక్తికరం గా ఉండటం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు