“సానా కష్టం” సాంగ్ కి విశేష స్పందన

Published on Jan 7, 2022 8:04 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రం లో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సానా కష్టం లిరికల్ వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాటకి యూ ట్యూబ్ లో విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకూ ఈ పాటకు 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ పాటలో రెజీనా కాసాండ్రా ఆడి పాడింది. ఈ చిత్రం ను ఫిబ్రవరి 4 వ తేదీన భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :