ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమాల్లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్, పీరియాడిక్ సినిమా రణబాలి కూడా ఒకటి.
ఇటీవల వచ్చిన టీజర్ తో మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మొన్ననే రష్మిక కూడా తన పోర్షన్స్ పూర్తి చేసుకోగా ఇప్పుడు దర్శకుడు రణబాలి షూట్ అంతా పూర్తి చేసినట్లుగా తన యూనిట్ మొత్తం అంతా కలిపి రణబాలి డైలాగ్ చెబుతూ ఓ క్లిప్ ని షేర్ చేసి తెలిపారు.
మొత్తం 130 రోజుల మ్యాడ్నెస్ ని తన ఆర్మీతో పూర్తి చేసినట్టుగా రాహుల్ తెలిపాడు. దీనితో తన పోస్ట్ వైరల్ గా మారింది. మరి ఈ సినిమాకి అజయ్, అతుల్ లు సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించగా ఈ అక్టోబర్ 16న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది.
And thats a wrap to the 130 days of madness with my relentless and restless army. @RanabaaliFilm @MythriOfficial @TheDeverakonda @iamRashmika pic.twitter.com/nBjT2lAHKw
— Rahul Sankrityan (@Rahul_Sankrityn) September 17, 2026
