సూపర్ స్టార్ మహేష్ బాబుకి ‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్. దూకుడు తో మొదలైన వారి జర్నీ ఇంకా సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. ‘దూకుడు’, ‘1-నేనొక్కడినే’ సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ‘ఆగడు’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 19న భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్దమవుతోంది.
ఇదిలా ఉంటే ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం 14 రీల్స్ వారు మహేష్ బాబుతో 100కోట్ల సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. కానీ 14 రీల్స్ సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం వారు మహేష్ తో 100కోట్ల సినిమా తీయడానికి సిద్దంగానే ఉన్నారు కానీ శంకర్ డైరెక్ట్ చెయ్యాలి లేదా శంకర్ లా బడ్జెట్ రికవర్ చేయగల డైరెక్టర్ తో చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ప్రస్తుతం 14 రీల్స్ ప్రొడక్షన్ టీం ‘ఆగడు’ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.
