15 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో దూసుకెళ్తున్న రామ్ ‘ది వారియ‌ర్’ బుల్లెట్ సాంగ్..!

Published on Apr 27, 2022 2:00 am IST


ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘ది వారియ‌ర్‌’. ఇందులో రామ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కనిపించబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం జూలై 14న విడుద‌ల కానుంది.

అయితే ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘బుల్లెట్’ లిరిక‌ల్ సాంగ్‌ యూట్యూబ్‌లో దూసుకెళ్తుంది. తెలుగు మరియు తమిళ్‌లో కలిపి ఈ సాంగ్ 15 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. శ్రీ మ‌ణి సాహిత్యం అందించిన ఈ పాట‌ను త‌మిళ స్టార్ శింబు ఆలపించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ పాటలో రామ్, కృతి శెట్టిల డ్యాన్స్ స్టెప్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :