“జై భీమ్” టీజర్ దూకుడు…సినిమా పై భారీ అంచనాలు!

Published on Oct 20, 2021 9:00 am IST

సూర్య హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం జై భీమ్. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ వేగవంతం గా జరుగుతున్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు విడియోలు సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి. తాజాగా విడుదల అయిన టీజర్ తో సర్వత్రా ఆసక్తి మొదలైంది. గడిచిన 4 రోజుల్లో 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం తో సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని పై చర్చలు జరుగుతున్నాయి.

జ్యోతిక మరియు సూర్య లు నిర్మిస్తున్న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 2 వ తేదీన ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి సీన్ రోల్డాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్, రమేష్, రజిష విజయన్, మనికందన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More