లెహరాయి సాంగ్ కి సూపర్ రెస్పాన్స్..15 మిలియన్ వ్యూస్ కి పైగా!

Published on Oct 19, 2021 11:30 am IST

అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే హీరో హీరోయిన్ లుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం ను అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు మరియు వాసు వర్మ లు నిర్మించడం జరిగింది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన లెహారాయి సాంగ్ ప్రేక్షకులని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది అని చెప్పాలి. ఈ పాటకి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో ఈ లిరికల్ సాంగ్ 15 మిలియన్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. శ్రీమణి లిరిక్స్ రాయగా సిద్ శ్రీరామ్ పాడారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించడం జరిగింది. సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More