ఆర్ఆర్ఆర్ మాస్ బీట్ కి 15 మిలియన్ వ్యూస్!

Published on Nov 11, 2021 1:32 pm IST

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం ను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి మాస్ అంతెం నాటు నాటు లిరికల్ వీడియో విడుదల అయ్యింది.

ఈ పాట విడుదల అయ్యి 24 గంటలు కాకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకూ ఈ పాట అన్ని బాషల్లో కలిపి 15 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అదే విధంగా 1 మిలియన్ కి పైగా లైక్స్ సాధించడం విశేషం. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో ఒలివియా మోరిస్, అలియా భట్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అయితే మొదటి సారి గా ఇద్దరు స్టార్ హీరోలు, అది కూడా టాప్ డాన్సర్స్ ఇద్దరూ కూడా ఈ నాటు నాటు కి స్టెప్పులు వెయ్యడం తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని థియేటర్ల లో చూసేందుకు ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :