15 మిలియన్స్ తో దూసుకు పోతున్న ఆర్ఆర్ఆర్ “ఎత్తర జెండా”

Published on Mar 16, 2022 12:30 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, వీడియో లకు, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం నుండి ఎత్తర జెండా అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట ను అన్ని బాషల్లో విడుదల చేయగా, ప్రస్తుతం దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు అన్ని బాషల్లో ఇప్పటి వరకూ 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :