15 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న పుష్ప “శ్రీవల్లి”

Published on Oct 16, 2021 3:03 am IST


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ చిత్రం మొదటి పార్ట్ పుష్ప ది రైస్ పేరిట ఈ డిసెంబర్ లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకు విశేష ఆదరణ వస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి శ్రీవల్లి లిరికల్ సాంగ్ విడుదల అయింది. ఈ పాట ఇప్పటి వరకు కూడా 15 మిలియన్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రశ్మిక నటిస్తుంది. ఈ చిత్రం లో మలయాళ నటుడు ఫాహద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :