పుష్ప మానియా: నాలుగు బాషల్లో 15 మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్న పుష్ప ట్రైలర్!

Published on Dec 7, 2021 10:30 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ అన్ని బాషల్లో విడుదల చేయడం జరిగింది.

ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది. యూ ట్యూబ్ లో సైతం భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ నాలుగు బాషల్లో కలిపి 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. అల్లు అర్జున్ ఊర మాస్ గెటప్ లో నటిస్తున్న ఈ చిత్ర పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, ఫాహాద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ముత్తంశెట్టి మీడియా తో కలిసి నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :