150 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న”సూసేకి” సాంగ్!

150 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న”సూసేకి” సాంగ్!

Published on Jul 2, 2024 8:30 PM IST

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule). ఈ చిత్రంను డిసెంబర్ 6, 2024 న వరల్డ్ వైడ్ గా భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్, టైటిల్ సాంగ్ లకు అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం నుండి రిలీజైన ది కపుల్ సాంగ్ (సూసేకి) కూడా సెన్సేషన్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది.

ఈ సాంగ్ కి ఇప్పటి వరకూ 150 మిలియన్స్ కి పైగా వ్యూస్, 2 మిలియన్స్ కి పైగా లైక్స్ వచ్చాయి. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. పుష్ప ది రైజ్ చిత్రంలోని పాటల మాదిరిగానే, ఈ చిత్రంలోని పాటలకు కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ రావడం విశేషం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు