160 కోట్ల యూత్ బ్లాక్ బస్టర్ ‘వాలా 2’ తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది!

ఈ ఏడాది మన తెలుగులో మన శంకర వరప్రసాద్ గారు అంటూ భారీ హిట్ కొట్టిన నిర్మాత సాహు గారపాటి మలయాళంలో సైలెంట్ గా ఓ చిన్న సినిమా విడుదల చేసి సంచలన సక్సెస్ అందుకున్నారు. మరి ఆ సినిమానే “వాలా 2”. ఇది వరకే మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా వాలా కి సీక్వెల్ గా వచ్చిన ఈ యూత్ ఎంటర్టైనర్ భారీ బ్లాక్ బస్టర్ అయ్యి ఏకంగా 160 కోట్లకి పైగా గ్రాస్ ని ఒక్క మలయాళం నుంచే రాబట్టింది.

ఇలా ఈ సినిమా సక్సెస్ గట్టిగా వినిపించేసరికి తెలుగు వెర్షన్ రిలీజ్ కూడా ఉంటుంది అని చాలా మంది భావించారు. మరి ఫైనల్ గా షైన్ స్క్రీన్స్ వారు ఈ సెన్సేషనల్ హిట్ రిలీజ్ డేట్ ని ఇప్పుడు ఇచ్చేసారు. ఈ ఏప్రిల్ 24న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పుడు ప్రకటించారు. ఇది మాత్రం తెలుగు ఆడియెన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాని సవిన్ సా దర్శకత్వం వహించగా హాషిర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్, సుదీష్, బిజుకుట్టన్, వేద శంకర్, ఆరాధ్య సాయి, ఏంజెల్ మరియా తదితరులు నటించారు.

Exit mobile version