గ్యాప్ లేకుండా షూటింగ్ కొనసాగిస్తున్న “18పేజెస్”

గ్యాప్ లేకుండా షూటింగ్ కొనసాగిస్తున్న “18పేజెస్”

Published on Nov 30, 2022 6:35 PM IST

నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ తో దూసుకు పోతున్నాడు. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 18 పేజెస్. ఈ చిత్రం ను డిసెంబర్ 23, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. షూటింగ్ పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ గ్యాప్ లేకుండా కష్టపడుతోంది. అందుకు సంబంధించిన ఒక వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

హైదరాబాద్ లో గ్యాప్ లేకుండా నైట్ కూడా షూటింగు చేస్తున్న సెట్ లోని చిన్న వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ స్టోరీ అందించగా, పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. జీఏ 2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ల పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు