మరో ఇంట్రెస్టింగ్ మూవ్ తో ఆకట్టుకుంటున్న “18 పేజెస్” టీమ్!

మరో ఇంట్రెస్టింగ్ మూవ్ తో ఆకట్టుకుంటున్న “18 పేజెస్” టీమ్!

Published on Dec 22, 2022 7:00 PM IST


యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, అందమైన నటి అనుపమ పరమేశ్వరన్ 18 పేజెస్ అనే ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కోసం మరోసారి జంట కట్టారు. కుమారి 21ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందు మేకర్స్ ఆసక్తికర ఎత్తుగడను రూపొందించారు.

సింగిల్ స్క్రీన్‌లు మరియు మల్టీప్లెక్స్‌లలో సహేతుకమైన ధరలకు, అంటే రూ. 150 లేదా అంతకంటే తక్కువ కి సినిమా చూసేలా ప్లాన్ చేశారు. దీని కారణం గా థియేటర్ల కి ప్రేక్షకులు వస్తారని టీమ్ ఆలోచిస్తోంది. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సరయు, పోసాని కృష్ణ మురళి, అజయ్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు