’18 పేజెస్’ టీమ్ రెండున్నరేళ్ల కష్టం ఫలిస్తుందని ఆశిస్తున్నాను – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

’18 పేజెస్’ టీమ్ రెండున్నరేళ్ల కష్టం ఫలిస్తుందని ఆశిస్తున్నాను – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Published on Dec 20, 2022 12:02 AM IST

నిఖిల్ సిద్దార్ధ హీరోగా గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై ప్రస్తుతం తెరకెక్కిన లవ్, రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 18 పేజెస్. ఇటీవల కార్తికేయ 2 మూవీ తో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అందుకున్న నిఖిల్ సిద్దార్థ తప్పకుండా ఈ మూవీ తో కూడా హిట్ అందుకుంటారని అంటోంది యూనిట్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ యొక్క టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. కాగా నేడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వేషన్ సెంటర్ లో గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ, తన తండ్రి అల్లు అరవింద్ ఇటీవల తనతో మాట్లాడుతూ, మనకి ప్రత్యేకంగా ఓటిటి ఉన్నప్పటికీ కూడా మన సినిమాలు థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వాలని చెప్పారని, తరచు ఆ విధంగా అందరూ బాగుండలేనేదే ఆయన ఆలోచన అని అన్నారు. ఇక ఈ మూవీ కోసం డైరెక్టర్ సూర్య ప్రతాప్ దాదాపుగా నాలుగేళ్ళ వరకు ఆగి మరొక సినిమాకి కమిట్ కాలేదని, ఆ విధంగా ఈ మూవీ పట్ల ఆయనకు ఉన్న డెడికేషన్ చూస్తుంటే దీని కోసం ఆయన ఎంత కష్టపడ్డారో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.

హీరో నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 మూవీ తో భారీ సక్సెస్ కొట్టి మంచి జోరు మీదున్నారని, అలానే తప్పకుండా 18 పేజెస్ మూవీ కూడా మంచి విజయం అందుకుని ఆయన కెరీర్ ని మరింతగా ముందుకి తీసుకెళ్లాలని కోరుకుంటునానట్లు తెలిపారు. ఇక దర్శకుడు సుకుమార్, అలానే బన్నీ వాసు ఇద్దరూ ఈ మూవీకి నిర్మాతలు అవడంతో తనకు ఈ మూవీ సొంత సినిమా వంటిదని, మొత్తంగా టీమ్ అందరూ దాదాపుగా రెండున్నరేళ్లు పడ్డ కష్టం ఫలించి, ఈ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుని మంచి సక్సెస్ అందుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు అల్లు అర్జున్.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు