త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “18 పేజెస్”

త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “18 పేజెస్”

Published on Mar 21, 2023 12:00 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, గార్జియస్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 18 పేజెస్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. డిజిటల్ ప్రీమియర్ గా కూడా మంచి రెస్పాన్స్ ను కొల్లగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

త్వరలో ఈ చిత్రం జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. GA2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ లపై సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు