19 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “కళావతి”

Published on Feb 15, 2022 12:03 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా తొలిసారి కీర్తి సురేష్ నటిస్తుంది. పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు 14 రీల్స్ ప్లస్ పతాకం పై ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి విడుదల అయిన కళావతి లిరికల్ వీడియో సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకూ 19 మిలియన్ వ్యూస్ ను సాధించడం మాత్రమే కాకుండా, 912 కే కి పైగా లైక్స్ ను సాధించి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు సోషల్ మీడియా లో సైతం భారీ రెస్పాన్స్ వస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మే 12, 2022 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :