ప్రెస్ నోట్ : “19 ఏళ్ల వరుణ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు…సాయం చేయండి”

Published on May 6, 2020 5:11 pm IST

అమెరికాలో స్థిరపడాలని భారతీయులతోపాటు చాలా దేశాల వారు కలలు కంటుంటారు. ముఖ్యంగా భారతీయులు తమ `డాలర్` డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు అగ్రరాజ్యంలో అడుగుపెడుతుంటారు.

విద్య, ఉద్యోగం, వ్యాపారం…ఇలా రకరకాల రంగాల్లో స్థిరపడిన భారతీయులెందరో అమెరికాలో ఉన్నారు. అలా తనతోపాటు తన కన్నవారి కలలను నెరవేర్చేందుకు వరుణ్ కూడా అమెరికాలోని కాన్సాస్ లో కొద్ది నెలల క్రితం వరుణ్ అడుగుపెట్టాడు. కంప్యూటర్ ఇంజనీర్ గా మారి అమెరికాలో ఉజ్వల భవిష్యత్తు ఏర్పరుచుకుందామని స్వదేశాన్ని వదిలివెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్ లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న వరుణ్ మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు.

జాలి, దయ, కలుపుగోలుతనం…పరిస్థితులకు తగ్గట్లు ఒదిగిపోయే స్వభావం ఉన్న వరుణ్ అతి కొద్ది కాలంలోనే ఎంతో మంది మిత్రులను, సన్నిహితులను సంపాదించుకున్నాడు. విద్యతో పాటు బాయ్ స్కౌట్ గా సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనే వరుణ్…ఇతరులకు చేతనైన సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇటు యూనివర్సిటీతో పాటు అటు ఇరుగుపొరుగువారితోనూ కలివిడిగా ఉండే వరుణ్ …..అమెరికన్, ఇండియన్ కమ్యూనిటీస్ లలో సుపరిచితుడు. ఈ స్వభావం వల్లే వరుణ్ ను అందరూ ఇష్టపడతారు.

అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో వరుణ్ జీవితం అనుకోని మలుపు తిరిగింది. వరుణ్ ను విధి చిన్న చూపు చూసింది. హఠాత్తుగా ఓ రోజు వరుణ్ కు ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. ఈ వార్త విన్న వెంటనే వరుణ్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. వరుణ్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయినప్పటికీ కుంగిపోకుండా…వరుణ్ కు హార్ట్, బ్రెయిన్ సర్జరీ చేయించారు.

ప్రస్తుతం కాన్సాస్ లోని సెయిట్ ల్యూక్స్ ప్లాజా హాస్పిటల్ లోని ఐసీయూలో గత 18 రోజులుగా వరుణ్ చికిత్స పొందుతున్నాడు. వరుణ్ కు ఇంకా ప్రాణాపాయం తప్పలేదు. చికిత్స కొనసాగించి వరుణ్ పూర్తిగా కోలుకొని మామూలు జీవితం గడపాలంటే మీవంటి దయార్థ హృదయులైన దాతల సాయం కావాలి.

ఈ కష్ట సమయంలో వరుణ్ కోసం చేపట్టిన ఫండ్ రైజింగ్ కు మీ వంతు సహకారం అందించండి. వరుణ్ కు ప్రాణదానం చేయండి.

ద‌య‌చేసి ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆన్‌లైన్‌లో ఈ లింక్‌ల ద్వారా స‌హాయం చేయండి.

సాఫీగా సాగిపోతున్న వరుణ్ జీవితంలో ఓ రోజు అనూహ్య ఘటన జరిగింది. కాలు నొప్పిగా ఉండడంతో వైద్యుడిని సంప్రదించిన వరుణ్ కు…అది చిన్న సమస్యేనని చెప్పాడు డాక్టర్. అయితే, నొప్పి తగ్గకపోవడంతో… సెయిట్ ల్యూక్స్ ప్లాజా హాస్పిటల్ కు వెళ్లాడు వరుణ్. అక్కడ వరుణ్ ను పరీక్షించిన వైద్యులు ….అతడి బ్లడ్ ఇన్ ఫెక్షన్ అయిందని తేల్చారు. ఒక్కసారిగా వరుణ్ కలలు కరిగిపోయాయి.

దీంతో, వెంటనే వరుణ్ కు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఒకేసారి నాలుగు వాల్వ్ లను మార్చారు. 19 ఏళ్ల చిన్న వయస్సులో ఓపెన్ హార్ట్ చేసినా ఆ చిన్ని గుండె తట్టుకుంది. సర్జరీ తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులతో వరుణ్ నవ్వుతూ మాట్లాడాడు. అయితే, ఆ నవ్వు ఎక్కువ రోజులు నిలువలేదు. ఆ తర్వాత వరుణ్ మెదడులో రక్తం గడ్డగట్టింది. దీంతో, వరుణ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.

దీంతో, గత 18 రోజులుగా వరుణ్ ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ చికిత్స కోసం చాలా డబ్బు అవసరం. ఈ పరిస్థితి ఎవరికి వచ్చినా….ఆ సమయంలో వారు కోరుకునేది ఆపన్న హస్తం…ఆర్థిక సాయం. ఇటువంటి విపత్తు వచ్చినపుడు ఏ కుటుంబమైనా ఆర్థికంగా చితికిపోతుంది (స‌హాయం ఇచ్చేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి).

వరుణ్ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డను బ్రతికించుకోవడం కోసం ఉన్నదంతా ఖర్చుపెట్టారు. ఇపుడు తమ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు దాతల విరాళాలకోసం ఎదురు చూస్తున్నారు. తమ బిడ్డను బ్రతికించుకోవడం కోసం…కన్న కొడుకు ఉజ్వల భవిష్యత్తు కోసం దాతలు తోచినంత విరాళం అందించాలని వారు ప్రార్థిస్తున్నారు.

వరుణ్ కు తోచినంత ఆర్థిక సాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు దానం చేసే అతి కొద్ది మొత్తం కూడా వరుణ్ వైద్యానికి సంజీవనిలా మారుతుంది (స‌హాయం ఇచ్చేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి).

ఆర్థిక సాయంతో పాటు వరుణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం. ఈ ఫండ్ రైజింగ్ లింక్ ను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు…ఇలా వీలైనంత ఎక్కువమందికి షేర్ చేయండి. వ్యక్తిగతంగా వరుణ్ కు మీవంతు సాయం అందించండి.

వరుణ్ కు ఆర్థిక సాయం అందించేందుకు ఈ లింక్ ను క్లిక్  చేయండి, షేర్ చేయండి.

ఇట్లు

వరుణ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు

Press release by: Indian Clicks, LLC

సంబంధిత సమాచారం :

X
More