విడుదల కి సిద్ధమైన రానా “1945” చిత్రం!

Published on Dec 9, 2021 4:30 pm IST

రానా దగ్గుపాటి హీరోగా సత్య శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 1945. పలు అనివార్య కారణాల వల్ల విడుదల ఆలస్యం అయిన ఈ చిత్రం, ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల కాబోతుంది.

తాజాగా చిత్రం యూనిట్ 1945 విడుదల తేదీ పై అధికారిక ప్రకటన చేయడం జరిగింది. డిసెంబర్ 31 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. రానా దగ్గుపాటి ఈ చిత్రం లో స్వాతంత్ర్య సమర యోధుడు గా నటిస్తున్నారు. ఈ చిత్రం లో రానా దగ్గుపాటి సరసన హీరోయిన్ గా రెజీనా కాసాండ్రా నటిస్తుంది. అంతేకాక ఈ చిత్రం లో సత్యరాజ్, నాజర్, ఆర్ జే బాలాజీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :