స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ 2.0 చిత్రం యొక్క ట్రైలర్ విడుదలకు ముహూర్తం కుదిరింది. దీపావళి కానుకగా నవంబర్ 3న ఈ ట్రైలర్ ప్రేక్షకులముందుకు రానుంది.
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ , బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అలాగే అమీ జాక్సన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఏఅర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు , తమిళ ,హిందీ భాషల్లో నవంబర్ 29న భారీ స్థాయిలో విడుదల కానుంది. ‘రోబో’ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం ఫై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
