2.0 జనవరికి రిలీజయ్యే ఛాన్స్ లేదట !
Published on Oct 29, 2017 11:53 am IST


సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ ల కలయికలో వస్తున్న ‘2.0’ చిత్రం కోసం భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’ తర్వాత వస్తున్న ఆ స్థాయి సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గత శుక్రవారం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో ఆడియో వేడుక జరుపుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తేదీన విడుదల కుదరదని అంటున్నారు.

ఎందుకంటే సినిమాకు సంబంధించి విఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా ఉన్నాయని, అవి పూర్తవడానికి ఇంకా సమయం పడుతుందని అంతేగాక అక్షయ కుమార్ యొక్క ‘ప్యాడ్ మాన్’ జనవరి జనవరి 26న విడుదలవుతుండటంతో ‘2.0’ విడుదలయ్యేది వేసవికేనని అంటున్నారు. మరి చిత్ర టీమ్ ఈ వార్తలపై స్పందించి ఖచ్చితమైన విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.

 
Like us on Facebook