‘రోబో 2’ ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే..!

robo2
సూపర్ స్టార్ రజనీ కాంత్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ప్రభంజనం ‘రోబో’కి సీక్వెల్‌గా ప్రస్తుతం ‘రోబో 2’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోందన్న ప్రచారం పొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే 50% వరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నవంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు టీమ్ స్పష్టం చేసింది. నేడు శంకర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టీమ్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఓ కొత్త అనుభూతినిస్తుందని తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏ.ఆర్.రహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.