2 మిలియన్స్ లైక్స్ సాధించిన నాటు నాటు లిరికల్ వీడియో!

2 మిలియన్స్ లైక్స్ సాధించిన నాటు నాటు లిరికల్ వీడియో!

Published on Nov 20, 2021 2:01 AM IST


రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం ను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఇటీవల విడుదలైన నాటు నాటు మాస్ అంతెం లిరికల్ వీడియో కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట కి ఇప్పటి వరకు కూడా రెండు మిలియన్స్ కి పైగా లైక్స్ రావడం విశేషం. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు