పుష్ప టీజర్ కి 2 మిలియన్ లైక్స్…టాలివుడ్ లో నంబర్ వన్ రికార్డ్!

Published on Nov 23, 2021 3:30 pm IST


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో ఊర మాస్ గెటప్ లో కనిపిస్తున్నారు. పుష్ప చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ కాగా, పాటలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. పుష్ప ఇంట్రడక్షన్ వీడియో కేవలం అభిమానులను మాత్రమే కాకుండా ప్రేక్షకులని సైతం విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఈ పుష్ప ఇంట్రడక్షన్ వీడియో టాలీవుడ్ చరిత్ర లోనే రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకూ ఈ వీడియో కి యూ ట్యూబ్ లో 89 మిలియన్ వ్యూస్ రాగా, 2 మిలియన్ కి పైగా లైక్స్ రావడం విశేషం. 2 మిలియన్ లైక్స్ సాధించిన తొలి టీజర్ గా పుష్ప రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. అంతేకాక 466కే కామెంట్స్ చేయడం తో సినిమా పై ఏ తరహాలో చర్చ జరుగుతుందో అర్దం అవుతుంది.

పుష్ప చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక నటిస్తుండగా, ఫాహద్ ఫజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

పుష్ప వీడియోలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :