“ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” టీజర్ కి విశేష స్పందన

“ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” టీజర్ కి విశేష స్పందన

Published on Jan 23, 2022 5:54 PM IST

సుధీర్ బాబు, కృతి శెట్టి హీరో హీరోయిన్ లుగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. గాజులపల్లి సుధీర్ బాబు సమర్పణ లో బెంచ్ మార్క్ స్టూడియోస్ మరియు మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మహేంద్ర బాబు మరియు కిరణ్ బాల్లపల్లి సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను ప్రకటించిన సందర్భం నుండి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం టీజర్ కి 2 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు