టాప్ లో ట్రెండ్ అవుతోన్న “రంగరంగ వైభవంగా” టైటిల్ టీజర్

టాప్ లో ట్రెండ్ అవుతోన్న “రంగరంగ వైభవంగా” టైటిల్ టీజర్

Published on Jan 25, 2022 6:02 PM IST

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తన మూడవ చిత్రాన్ని తాజాగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి రంగరంగ వైభవంగా అనే టైటిల్ ను ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ టైటిల్ టీజర్ ను నిన్న విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో కి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాక యూ ట్యూబ్ లో సైతం ఈ వీడియో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో 2 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకొని టాప్ లో దూసుకు పోతుంది.

కేతిక శర్మ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పై ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ సైతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు