టాప్ లో ట్రెండ్ అవుతోన్న బాలయ్య “అడిగా అడిగా” సాంగ్

Published on Sep 19, 2021 10:10 pm IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రం కి థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి అడిగా అడిగా అంటూ ఒక లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సాంగ్ కి యూ ట్యూబ్ లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో సైతం ఈ పాట కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ యూ ట్యూబ్ లో ఈ పాట 2 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

అడిగా అడిగా అనే పాట కు కళ్యాణ చక్రవర్తి లిరిక్స్ రాయగా, ఎస్పీ చరణ్ మరియు శ్రుతి లు పాడారు. ఈ చిత్రానికి మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం లో శ్రీకాంత్ సైతం ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :