“శ్యామ్ సింగరాయ్” టీజర్ కి భారీగా వ్యూస్!

Published on Nov 18, 2021 1:43 pm IST

నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లులు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ విడుదల అయ్యింది. విడుదల అయిన కొద్ది గంటల్లోనే 2 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. నాని ఈ చిత్రం లో డిఫెరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటం తో సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారుతోంది. మొత్తం నాలుగు బాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళి శర్మ, అభినవ్ గోమతం లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24 వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.

 

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :