‘రోబో-2’ ఆడియో వేడుకలో జరగబోయే అద్భుతాలివే !
Published on Oct 24, 2017 4:04 pm IST

స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కలయినాలకో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘రోబో-2’ ఆడియో వేడుక ఈ నెల 27న దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రం జరుపుకోనంత వైభవంగా ఏఈ కార్యక్రమం ఉండనుంది. ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయ సినీ ప్రేక్షకుడి దృష్టి ఇప్పుడు ఈ వేడుక మీదే ఉంది. ఈ వేడుక ఎందుకింత స్పెషల్ అంటే దానికీ కొన్ని కారణాలున్నాయి. అవేమిటంటే…

⤏ ఈ కార్యక్రమానికి దుబాయ్ కింగ్ హాజరయ్యే అవకాశాముంది.

⤏ ఈ వేడుకను ప్రేక్షకులకు లైవ్ లో చూపించేందుకు 2 కోట్ల విలువైన ఎల్.ఈ. డీ స్క్రీన్లను వినియోగించనున్నారు.

⤏ సుమారు 125 మంది సభ్యుల బృందంతో ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.

⤏ ఈ వేడుకకు సంబంధించి సుమారు 12000 ఫ్రీ పాసులు జారీ చేయబడ్డాయి. అంతేగాక ఇండియా నుండి దుబాయ్ కు ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్స్ ను కూడా ఏర్పాటు చేశారు.

⤏ బుర్జ్ ఖలీఫాలో ఆడియో వేడుక జరిపేందుకు అక్కడి ప్రభుత్వం దగ్గర అనుమతి పొందిన మొదటి సినిమా ‘రోబో-2’ నే కావడం అన్నిటినీ మించిన విశేషం.

 
Like us on Facebook