గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా ఇండియన్ జేమ్స్ కేమరూన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. అయితే అసలు ఈ సెన్సేషనల్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడే ఆ హైప్ నెక్స్ట్ లెవెల్లోకి వచ్చింది. అలాగే ఈ చిత్రంతో దర్శకుడు శంకర్ అలానే దర్శకుడు రాజమౌళి లతో నటించిన ఏకైక హీరోగా చరణ్ నిలిచాడు.
అయితే అసలు శంకర్ తో కాంబినేషన్ సినిమా అన్నపుడే నెక్స్ట్ లెవెల్ హైప్ వచ్చింది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ అయ్యి సరిగ్గా నేటితో ఏకంగా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యిందట. కానీ ఈ రెండేళ్లలో ఓ సినిమా నుంచి కేవలం ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ మాత్రమే వచ్చాయి. దీనితో చరణ్ ఫ్యాన్స్ మాత్రం చాలా డిజప్పాయింటింగ్ గా ఉన్నారు.
ఓ సినిమా అనౌన్స్ అయ్యి రెండేళ్లు అయినా కూడా ఏ సినిమాకి కేవలం ఈ ఫస్ట్ లుక్ టైటిల్ మాత్రమే రాలేదు అని ఇంకెప్పుడు అప్డేట్స్ ఉంటాయి అని ప్రొడక్షన్ హ్యాండిల్ ని అడుగుతున్నారు. అయితే ఇక్కడ తాము చెయ్యడానికి ఏమీ లేదని సినిమా నుంచి ఏం రావాలన్నా డైరెక్టర్ చేతిలోనే ఉందని చెప్పారు. మరి ఈ సినిమా విషయంలో శంకర్ ఎప్పుడు కనికరిస్తారో చూడాలి.