20 మిలియన్ వ్యూస్ తో టాప్ లో దూసుకెళ్తున్న “హనుమాన్” టీజర్!

20 మిలియన్ వ్యూస్ తో టాప్ లో దూసుకెళ్తున్న “హనుమాన్” టీజర్!

Published on Nov 23, 2022 8:08 PM IST


తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ హనుమాన్. ప్రైమ్ షో బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ను ఇటీవల మేకర్స్ విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ రిలీజైనప్పటి నుండి భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది. తాజాగా ఈ టీజర్ 20 మిలియన్ వ్యూస్ ను సాధించింది. యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ ను సాధించడం మాత్రమే కాకుండా, టాప్ లో ట్రెండ్ అవుతోంది.

తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రం లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రం లో కీలక పాత్రలో నటిస్తుంది. గౌర హారి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ లు సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డిఓపి శివేంద్ర అందిస్తున్నారు. ఈ టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడం తో సినిమా పై అంచనాలు మరింత గా పెరిగాయి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు