20 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “లైగర్” గ్లింప్స్

Published on Jan 2, 2022 8:52 pm IST


విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ ఈ చిత్రం ఉప శీర్షిక. పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే విడుదల అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి లైగర్ ఫస్ట్ గ్లింప్స్ పేరిట ఒక వీడియో విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ గ్లింప్స్ కి దేశం నలుమూలల నుండి విశేష స్పందన వస్తోంది. ఇప్పటి వరకూ ఈ గ్లింప్స్ కి 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. అంతేకాక 500కే కి పైగా లైక్స్ వచ్చాయి. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తుండగా ప్రముఖ లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ను ఆగస్ట్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

లైగర్ గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :