20 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న నాని “దసరా” ట్రైలర్!

20 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న నాని “దసరా” ట్రైలర్!

Published on Mar 15, 2023 8:30 PM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. మునుపెన్నడూ లేని అవతార్ లో నాని కనిపిస్తున్నారు. మార్చ్ 30, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఈ ట్రైలర్ అయిదు భాషల్లో కలిపి 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. తెలుగు తో పాటుగా, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం భారీగా రిలీజ్ కానుంది. రిలీజ్ అయిన ట్రైలర్ ఇంటెన్స్ గా, ఆసక్తికరం గా ఉండటం తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు