20 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న శ్రీవల్లి సాంగ్!

Published on Oct 18, 2021 12:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం మొదటి పార్ట్ పుష్ప ది రైస్ పేరిట డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ షురూ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన దాక్కో దాక్కో మేక అనే పాటకు సూపర్ రెస్పాన్స్ రాగా, ఇప్పుడు రెండవ పాట శ్రీవల్లి కు కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.

శ్రీవల్లి పాట కి ఇప్పటి వరకూ 5 బాషల్లో కలిపి 20 ప్లస్ మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. నాలుగు బాషల్లో సిద్ శ్రీరామ్ పాడగా, హిందీలో జావేద్ అలీ పాడటం జరిగింది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక నటిస్తుండగా, మలయాళ నటుడు ఫాహద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :