20 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “ఉస్తాద్ భగత్ సింగ్” గ్లింప్స్!

Published on May 20, 2023 1:06 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న చిత్రం కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ గ్లింప్స్ వీడియో కి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియో కి ఇప్పటి వరకూ 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి.

శ్రీలీల లేడీ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తోంది. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :