2017 ఈ ముగ్గురు సౌత్ స్టార్ హీరోలకు చాలా స్పెషల్ !

rajini-chiru-balayya
రానున్న 2017వ సంవత్సరం చాలా మంది హీరోలకు, డైరెక్టర్లకు స్పెషల్ ఇయర్ గా మారనుంది. మరీ ముఖ్యంగా ముగ్గురు స్టార్ హీరోలకు. వాళ్ళే సౌత్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ. దాదాపు 9 ఏళ్ల తరువాత మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘ఖైదీ నెం 150’ 2017 సంక్రాంతికి రిలీజ్ కానుండటంతో 2017 ఆయన సినీ జీవితంలో మర్చిపోలేని స్పెషల్ ఇయర్ గా మారనుంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ 160వ భారీ బడ్జెట్ చిత్రం, శంకర్ రూపొందిస్తున్న అద్భుతం ‘2 పాయింట్ 0’ 2017 దీపావళికే రిలీజ్ కానుంది.

ఈ చిత్రం పై భారతదేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. కాబట్టి 2017వ సంవత్సరం ఆయనకు కూడా ప్రత్యేకమైన సంవత్సరంగానే నిలవనుంది. ఇకపోతే నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్లో మైలు రాయిగా చెప్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కూడా 2017 సంక్రాంతి బరిలోనే విడుదలకానుంది. కాబట్టి ఆయనకు కూడా ఇది గుర్తుండిపోయే సంవత్సరం. ఇలా ఈ ముగ్గురు స్టార్ హీరోలకు ప్రత్యేకమైన 2017 వాళ్ళ అభిమానులకు కూడా ప్రత్యేకంగా నిలవాలని ఆశిద్దాం.