హిస్టారికల్ రన్ తో హిస్టరీ క్రియేట్ చేసిన “2018”.!

Published on May 26, 2023 10:35 pm IST

గత ఏడాది ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషనల్ టాక్ అండ్ రన్ తో అయితే దుమ్ము లేపిన “కాంతారా” తరహా లో ఈ ఏడాది మళయాళ సినిమా నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ సర్వైవల్ డ్రామా “2018” కూడా ఇదే రీతిలో సెన్సేషన్ ని రేపుతోంది. మెయిన్ గా మాలీవుడ్ మార్కెట్ లో ఏడేళ్ల నుంచి పదిలంగా ఉన్న సీనియర్ హీరో మోహన్ లాల్ నటించిన చిత్రం “పులి మురుగన్” రికార్డు గ్రాస్ వసూళ్ళని ఇపుడు 2018 చిత్రం క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది.

మోహన్ లాల్ చిత్రం వరల్డ్ వైడ్ 145 కోట్లు గ్రాస్ వసూలు చేయగా ఇప్పుడు దీనిని 146 కోట్ల గ్రాస్ తో 2018 చిత్రం బ్రేక్ చేసి ఇంకా సూపర్ స్ట్రాంగ్ రన్ తో దూసుకెళ్తుంది. పైగా ఇపుడు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతుండగా ఈ వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో యంగ్ నటుడు టోవినో థామస్ హీరోగా నటించగా జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించగా తెలుగులో అయితే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

సంబంధిత సమాచారం :