డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన లేటెస్ట్ బ్లాక్ బస్టర్!

Published on May 29, 2023 7:01 pm IST

టోవినో థామస్ ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం 2018, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. మాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో కూడా గత శుక్రవారం థియేటర్ల లో విడుదలైంది. ఈ చిత్రం కి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది ఈ చిత్రం. ప్రస్తుతం ప్రాఫిట్స్ లోకి అడుగు పెట్టిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అవుతోంది.

ఈ చిత్రం జూన్ 7 వ తేదీ నుండి సోనీ లివ్ లో ప్రసారం కానుంది. బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ వరకూ మరింత వసూళ్ళను రాబట్టే అవకాశం ఉంది. టోవినో థామస్‌తో పాటు, ఈ చిత్రంలో లాల్, నరేన్, అపర్ణ బాలమురళి, కళైరసన్, అజు వర్గీస్, వినీత్ శ్రీనివాసన్, కుంచాకో బోబన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 2018ని తెలుగులో బన్నీ వాసు విడుదల చేయగా, నోబిన్ పాల్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :