“2018 చిత్రానికి తెలుగు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్!

“2018 చిత్రానికి తెలుగు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్!

Published on May 27, 2023 1:26 AM IST

కేరళలో రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలబడిన 2018 చిత్రం నేడు తెలుగులో విడుదల అయింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్‌పీస్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. అంతేకాకుండా ఈ చిత్రం ప్రీమియర్ షోస్ ను రాత్రి హైదరాబాద్, వైజాగ్ మరియు విజయవాడలో ఘనంగా స్టార్ట్ చేసారు. ప్రెస్ స్క్రీనింగ్ మరియు సెలబ్రిటీ ప్రీమియర్ నుండి అనూహ్య స్పందన ఈ సినిమాకి లభించింది. అందుకే నిర్మాతలు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేశారు. ప్రీమియర్ బుకింగ్‌లు కూడా త్వరగా నిండిపోవడం మంచి శుభసూచకం.

ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు సెకండాఫ్ లో ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ లో కూర్చేబెట్టేలా కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుంటుంది. అంతేకాకుండా ఆ వరదల్లో ప్రేక్షకుడు చిక్కుకున్నట్లు అనిపించింది దర్శకుడు యొక్క దర్శకత్వ ప్రతిభ. ఈ సినిమాకు ఇప్పటికి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందనీ, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుందని, రానున్న రోజుల్లో ఈ సినిమా బుకింగ్స్ మరింతగా పెరుగుతాయని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.

2018 కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు