తెలుగు స్టేట్స్ లో రెండో రోజు అదరగొట్టిన “2018”.!

తెలుగు స్టేట్స్ లో రెండో రోజు అదరగొట్టిన “2018”.!

Published on May 28, 2023 12:14 PM IST

మళయాళ టాలెంటెడ్ హీరో టొవినో థామస్ హీరోగా ఆకాశం నీ హద్దురా ఫేమ్ నటి అపర్ణ బాలమురళి సహా తదితర కీలక తారాగణం నటించిన లేటెస్ట్ చిత్రం “2018”. మరి మళయాళ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్ అయ్యి రికార్డు వసూళ్లు నమోదు చేస్తున్న ఈ చిత్రం లేటెస్ట్ గా తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ కి వచ్చింది.

మరి ఈ చిత్రం అయితే తెలుగులో మొదటి రోజే ఒక ఒక కోటికి పైగా గ్రాస్ తో అదరగొట్టగా రెండో రోజు అయితే ఊహించని విధంగా దాదాపు 70 పర్సెంట్ జంప్ ని బాక్సాఫీస్ దగ్గర తీసుకొని డే 2 కి 1.72 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం మొత్తం రెండు రోజుల్లో అయితే 2.73 కోట్ల గ్రాస్ మార్క్ కి ఈ చిత్రం చేరుకుంది.

దీనితో అయితే తెలుగు మూవీ లవర్స్ మరోసారి డబ్బింగ్ చిత్రాన్ని ఎంతగానో ఓన్ చేసుకున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించగా తెలుగులో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వారు రిలీజ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు