తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ హోల్డ్ తో “2018”

తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ హోల్డ్ తో “2018”

Published on May 30, 2023 3:32 PM IST


టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 2018. ఈ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం నాల్గో రోజు బాక్సాఫీస్ వద్ద మరో 99.14 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. దీంతో ఈ చిత్రం నాలుగు రోజుల్లో 5.47 కోట్ల రూపాయలను రాబట్టడం జరిగింది.

జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి, ప్రాఫిట్స్ లోకి అడుగు పెట్టింది. వీక్ డేస్ లో కూడా ఈ తరహా వసూళ్లు సాధించడం పట్ల టీమ్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద స్లో అయ్యే అవకాశాలు కనపడటం లేదు. మరి ఈ వారంలో ఇంకా ఎంత వసూళ్లు సాధిస్తుందో చూడాలి. టోవినో థామస్‌తో పాటు, ఈ చిత్రంలో లాల్, నరేన్, అపర్ణ బాలమురళి, కళైరసన్, అజు వర్గీస్, వినీత్ శ్రీనివాసన్, కుంచాకో బోబన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 2018ని తెలుగులో బన్నీ వాసు విడుదల చేయగా, నోబిన్ పాల్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు