కేరళ లో సెన్సేషనల్ రికార్డు నమోదు చేసిన ‘2018’ మూవీ

కేరళ లో సెన్సేషనల్ రికార్డు నమోదు చేసిన ‘2018’ మూవీ

Published on May 30, 2023 12:09 AM IST

సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 2018 ఇప్పుడు కేరళలో భారీ స్థాయిలో మంచి కలెక్షన్ తో దూసుకెళుతోంది. అలానే ఇటు తమిళ్, తెలుగు ఆడియన్స్ నుండి కూడా ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఆకట్టుకునే డ్రామా మూవీ ఇప్పటికే మలయాళంలో అన్ని రికార్డులను తుడిచిపెట్టింది మరియు కేరళలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సరికొత్త సెన్సేషనల్ రికార్డు నెలకొల్పింది. 2018 మూవీ విడుదలైనప్పటి నుండి కేవలం 24 రోజుల్లో రూ. 80.11 కోట్లు వసూలు చేసింది మరియు మోహన్‌లాల్ పులిమురుగన్ (రూ. 78.50 కోట్లు)ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది.

2018 ఆల్ టైమ్‌లో అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ సినిమాగా, అలానే రూ. 150 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొట్టమొదటి మలయాళ సినిమాగా కూడా నిలిచింది. 2018 వ సంవత్సరంలో కేరళలో వరదల ఆధారంగా రూపొందిన ఈ సినిమా, ఆ సమయంలో వేలాది మంది కేరళ యువకులు మరియు అధికారులు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా విపత్తును ఎలా అధిగమించారు అనే కాన్సెప్ట్ తో అద్భుతంగా తెరకెక్కింది. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టోవినో థామస్, కుంచాకో బోబన్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, తన్వి రామ్, అపర్ణ బాలమురళి మరియు లాల్ కీలక పాత్రల్లో నటించారు. వేణు కున్నప్పిల్లి, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ దీనికి నిర్మాతలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు