ఓటిటి లో కూడా అదరగొడుతోన్న ‘2018’

Published on Jun 8, 2023 12:30 am IST

ఇటీవల మలయాళంలో రూపొంది అక్కడి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న సినిమా 2018. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై నాలుగు రోజుల్లో రూ. 4 కోట్లను వసూలు చేసి అదరహో అనిపించింది. ఇక ఈ సర్వైవల్ థ్రిల్లర్ లో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, జాయ్ మాథ్యూ, సుధీష్ కీలక పాత్రలు పోషించారు. నోబిన్ పాల్ మరియు విల్లమ్ ఫ్రాన్సిస్ స్వరాలు అందించారు.

ఈ సినిమా నిన్న రాత్రి నుండి ప్రముఖ ఓటిటి మాధ్యమం సోనీ లివ్ లో పలు భాషల్లో బుల్లితెర ఆడియన్స్ ముందుకి వచ్చింది. అయితే విషయం ఏమిటంటే ప్రస్తుతం, 2018 సోనీ లివ్ ఇండియాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అటు థియేటర్స్ లో బాక్సాఫీస్ రికార్డులను అదరగొట్టిన తమ సినిమా ఇటు ఓటిటిలో కూడా భారీ వీక్షణలను పొందుతుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. వేణు కున్నప్పిల్లి, సి.కె. పద్మ కుమార్ మరియు ఆంటో జోసెఫ్ 2018 మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మించగా జూడ్ ఆంథనీ జోసెఫ్ దీనికి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :