‘2018’ యుఎస్ఏ తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

Published on May 28, 2023 3:01 am IST

ప్రస్తుతం సర్వైవల్ థ్రిల్లర్ 2018 మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేరళ లో సూపర్ కలెక్షన్ సొంతం చేసుకున్న ఈ మూవీ తాజాగా తెలుగు, తమిళ భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇటు తెలుగు భాషలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ రాబడుతున్న 2018 మూవీ యొక్క యుఎస్ఏ రైట్స్ ని తాజాగా ప్రత్యంగిరా సినిమాస్ వారు సొంతం చేసుకున్నారు.

ఇది అక్కడి తెలుగు ఆడియన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో టోవినో థామస్, కుంచాకో బోబన్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి, కలైయరసన్, నరేన్, లాల్, ఇంద్రన్స్, అజు వర్గీస్, తన్వి రామ్ కీలక పాత్రలు పోషించారు. దీనిని వేణు కున్నప్పిల్లి, సి.కె. పద్మ కుమార్ మరియు ఆంటో జోసెఫ్ గ్రాండ్ గా భారీ ఎత్తున నిర్మించగా నోబిన్ పాల్ సంగీతాన్ని కంపోజ్ చేశారు.

సంబంధిత సమాచారం :