ఈ ఓటిటిలో రిలీజ్ కి వచ్చేసిన మలయాళం మస్ట్ వాచ్ థ్రిల్లర్.. ఎందులో అంటే

Eko

ఈ ఏడాదిలో మలయాళ సినిమా నుంచి పలు బ్యాంగర్ హిట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో ఒక ఊహించని విజయం సినిమా కోసం చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ సినిమానే ఈ ఏడాదికి చివరి ఓటిటి రిలీజ్ గా వచ్చేసింది. ఈ ఏడాదిలోనే వచ్చిన ఓ ఇంట్రెస్టింగ్ ఫాంటసీ థ్రిల్లర్ ‘పడక్కలం’ హీరో సందీప్ ప్రదీప్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కూడా ఓ సాలిడ్ థ్రిల్లర్ గానే వచ్చింది.

మరి ఆ సినిమానే ‘ఎకో’. కేవలం మలయాళంలోనే విడుదల మంచి వసూళ్లు సాధించి హిట్ అయ్యింది. అయితే వసూళ్ల కంటే ఈ సినిమాకి వినిపిస్తున్న టాక్ ఊహాతీతంగా ఉంది. మలయాళ ఆడియెన్స్ ది బెస్ట్ సినిమా ఇది అని అంటున్నారు. మరి ఇలాంటి మస్ట్ వాచ్ సినిమా ఇవాళ్టి నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ప్రస్తుతం కేవలం మలయాళంలో అందుబాటులోకి వచ్చేసింది. దింజిత్ అయ్యాతన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ లో మాత్రం ఈ జనవరి 7 నుంచి రానున్నాయట. మరి చాలా మంది అయితే ఈ సినిమా పట్ల ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఓటిటిలో చూసాక దీని రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version