Sankranti 2026: ఒకే ఓటిటి సంస్థకి ‘వాల్తేరు వీరయ్య’ హీరోస్ సినిమాలు..

MSG and BMW

వచ్చే ఏడాది తెలుగు సినిమా నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో కొన్నేళ్ల కితం సంక్రాంతి సీజన్ లో కలిసి వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టిన చిత్రం వాల్తేరు వీరయ్య హీరోలు మెగాస్టార్ చిరంజీవి అలాగే మాస్ మహారాజ రవితేజ హీరోలుగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి.

మన శంకర వరప్రసాద్ గారు అంటూ మెగాస్టార్ చిరంజీవి, భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ రవితేజ ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేసుకొని రిలీజ్ కి వచ్చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు సినిమాల ఓటిటి డీల్స్ కూడా ఓకే ఓటిటి సంస్థ సొంతం చేసుకోవడం విశేషం. మొదటిగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాని జీ 5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా డీల్ పూర్తయిన సమయానికి మన శంకర ప్రసాద్ గారు డీల్ కంప్లీట్ కాలేదు. కానీ ఆ తర్వాత ఇదే జీ 5 సంస్థ ఈ సినిమాని కూడా సొంతం చేసుకుంది. సో సంక్రాంతి బరిలో రాబోతున్న ఈ రెండు సినిమాల పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ స్ట్రీమింగ్ వీటిలోని ఉంటాయని చెప్పాలి. ఇక మన శంకర వరప్రసాద్ గారు జనవరి 12న వస్తుండగా భర్త మహాశయులకు డేట్ కన్ఫర్మ్ కావాల్సి ఉంది.

Exit mobile version